పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘాల నిరసన

by Aamani |
పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘాల నిరసన
X

దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరిపడా లెక్చరర్స్ లేక విద్యార్థుల కు అన్యాయం జరుగుతుందని కళాశాలకు వెంటనే సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఎంతోమందిని తీర్చిదిద్దిన కళాశాలలో సబ్జెక్టుల వారీగా లేకపోవడం వల్ల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారి చదువుని దృష్టిలో పెట్టుకొని కళాశాలలో అన్నీ సబ్జెక్టులకు సరిపడ లెక్చరర్స్ నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అనంతరం మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు సూచించాలని పెద్దముల్ తాహసిల్దార్ కిషన్ నాయక్ ను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మహమూద్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు నగేష్, పిడిఎస్యు నాయకులు నరేష్, నవీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story