- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బండి సంజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు..
దిశ, పరిగి : తాండూరు బీజేపీ నాయకులు మురళీదర్ గౌడ్ ను పరామర్శించేందుకు వెళ్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ ని పరిగి డివిజన్ పూడూరు మండలం మన్నెగూడ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మా కాన్వాయ్ ని ఎందుకు ఆపావంటూ ప్రశ్నించారు. ఎవరు అమన్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఏమీ సమాదానం చెప్పకుండా పోన్ లో సార్ తో మాట్లాడుతున్నానంటూ చెప్పారు. ఏసారుతో మాట్లాడుతున్నావు. ఆసారునే ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ పోలీసులను బీజేపీ నాయకులు చెప్పారు. పోన్ లో మాట్లాడిన అనంతరం బండి సంజయ్ కాన్వాయ్ ని వదిలేశారు.
దీంతో బీజేపీ నాయకులంతా పోలీసుల తీరునుతప్పుపట్టారు. కేసీఆర్ నియంత పాలనకు పోలీసులు కూడా వత్తాసు పలకడం కరక్టు కాదంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గుండాల దాడిలో గాయపడ్డ బీజేపీ నాయకుడు మురళీగౌడ్ ను పరామర్శించేందుక వెళ్తున్నామని పరామర్శకు వెళ్తుంటే అడ్డగించుడేందంటూ జిల్లా పోలీసుల తీరునై బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై ఎస్ఐ పి.విఠల్ రెడ్డిని ప్రశ్నించగా వాహనాలను తనిఖీ చేస్తున్నామని అందులో బాగంగా ఎవరు అని చూసి వదిలేసి ఉంటారని తెలిపారు.