పేదల పెళ్లికి పెద్దదిక్కుగా ప్రజా ప్రభుత్వం

by Sridhar Babu |
పేదల పెళ్లికి పెద్దదిక్కుగా ప్రజా ప్రభుత్వం
X

దిశ, ఇబ్రహీంపట్నం : పేదల పెళ్లికి పెద్దదిక్కుగా ప్రజా ప్రభుత్వం మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, అధిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని 359 మంది లబ్ధిదారులకు సుమారు 3 కోట్ల 74 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను,113 మంది లబ్ధిదారులకు సుమారు 28 లక్షల 66 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, సింగల్ విండో చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed