Parigi: పాఠశాల పక్కనే మురుగుకుంట.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

by Ramesh Goud |
Parigi: పాఠశాల పక్కనే మురుగుకుంట.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
X

దిశ, పరిగి : పాఠశాల పక్కనే మురుగు నీరు నిలిచి కుంటలా తయారైంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కిష్టమ్మగుడి తండా వాసులు ఆవేదన చెందుతున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కిష్టమ్మగుడి తండాలోని మురుగునీరంతా సీసీ రోడ్డుపై ఏరులై పారుతూ పాఠశాల వద్ద మురుగు కుంటలా తయారైంది. ఈ విషయమై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తండా వాసులు స్వయంగా స్థానిక కౌన్సిలర్, కమిసనర్, చైర్మన్ కు ఫిర్యాదు చేశామని చె బుతున్నారు. నెలలు గడుస్తున్నా సమ స్య పరిస్కారం కాకపోవడంతో మురుగు పక్కనే దుర్వాసన వస్తున్నా తప్పని పరిస్థితుల్లో విద్యాబోధన చేస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తండా వాసుల స్నానాలు, వంట పాత్రలు కడిగిన నీరంతా తమ పాఠశాల పక్కనే చేరి మురుగు కుంటలా తయారై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పా ఠశాలలో 60 మందికి పైగా విద్యా ర్థులు 5వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉం డడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు వాపోయారు. స్థానిక పాలకులు స్పందించి వెంటనే పాఠశాల ముందున్న మురుగును తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed