ప్రభుత్వ ఆసుపత్రిలో వింత పరిస్థితి.. డాక్టర్ రాసిన మందు ఒకటి,ఇచ్చింది మరొకటి

by Aamani |
ప్రభుత్వ ఆసుపత్రిలో వింత పరిస్థితి.. డాక్టర్ రాసిన మందు ఒకటి,ఇచ్చింది మరొకటి
X

దిశ, చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంట్ స్థానమైన ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా ఉంది. వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేనే ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్ గా ఉంటాడు. పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ అయినటువంటి చేవెళ్లలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ డాక్టర్ ఒక మందు రాస్తే ఫార్మసీలో మరో మందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్నాయి. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి (10) జ్వరం దగ్గుతో ఆసుపత్రికి వస్తే జ్వరం దగ్గుకు డాక్టర్ చీటీ పై రాసిన మందులు కాకుండా కడుపు నొప్పి సిరప్ మందు ఇచ్చారని మహేశ్వరి తల్లి ఆరోపించారు. మరో 10 నెలల బాబుకు డాక్టర్ సిటిజన్ రాస్తే ఫార్మసీలో పారాసిటామల్ ఇచ్చి పంపిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసీలో ఇంత దయనీయంగా ఉంది పరిస్థితి. డాక్టర్ రాసే దానికి ఫార్మసీలో ఇచ్చే మందులకు అసలు పొంతన ఉండటం లేదు. మరి కొంతమందికి చీటీపై డాక్టర్ రాసిన మందులు బయట తీసుకోండని చీటీ తీసుకొని రోగులను బయటికి పంపిస్తున్నారు.

దీని అసలు కథ ఇక్కడ ఉంది..

ఫార్మసీలో మందులు ఇవ్వాల్సిన ఫార్మర్ సిస్టులు ఫార్మసిస్టు రూంలో కూర్చున్నారు. 104 అంబులెన్స్ లో ఉండాల్సిన వారు ఫార్మసీలో మందులు రోగులకు అందిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే నేను కూడా రిపోర్టర్ నే అని బుకాయిస్తున్నాడు. ఫార్మసీలో గ్రేడ్ వన్ ఉద్యోగం చేస్తూ నేను కూడా రిపోర్టర్ నే అని చెప్పుకొని తిరుగుతున్న మక్తర్ మహమ్మద్. మరో ఉద్యోగి గ్రేట్ 2 అరుణ జరిగితే జరుగుతుంది సార్ చిన్న పొరపాటు అంటూ సముదాయించుకుంటున్నారు.

ఫార్మసీలో రోగులకు మందులు అందించాల్సిన గ్రేటు ఉద్యోగి అరుణ రోగులకు మందులు అందించకుండా ఫార్మసీ స్టోర్ రూమ్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. 104 అంబులెన్స్ లో ఉండాల్సిన శివ కుమార్ ఆస్పత్రి ఫార్మసీలో రోగులకు మందులు అందజేస్తున్నాడు. ఒక రిపోర్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఎలా చేస్తున్నాడు. రిపోర్టర్ అని చెప్పుకుంటూ ఉద్యోగ వృత్తిలో నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాడు అంటూ రోగుల మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు చేవెళ్ల ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాను : ఆసుపత్రి సూపర్డెంట్ రాజేంద్ర ప్రసాద్

ఫార్మసిస్ట్ ఇన్చార్జి కింద ఇద్దరు ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. అందువల్ల రిక్వెస్ట్ మేరకు 104 శివ కేటాయించాను.అయితే గ్రేడ్ 1 గా ఉన్న ముక్తర్ అహ్మద్, గ్రేడ్ 2 లో ఉన్న అరుణ ఇద్దరు స్వామన్యయంతో కలిసి పనిచేసుకువాలి.గ్రేడ్ 2 గా ఉన్న అరుణ పర్యవేక్షణలో రోగులకు మందులు ఇవ్వాలి. అరుణ పరిరక్షణలో రోగులకు మందులు ఇచ్చేలా నేను చర్యలు తీసుకుంటాను.

Advertisement

Next Story