అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ కొరడా

by Sumithra |
అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ కొరడా
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్, పసుమాముల గ్రామాలలో చేపట్టిన పలు అక్రమనిర్మాణాలను శుక్రవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పూర్తివివరాల ప్రకారం కుంట్లూరు పరిధిలోని సర్వేనెంబర్ 83, పస్మాముల పరిధిలోని సర్వే నెంబరు 452లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పోలీస్ బలగాలతో అక్కడి చేరుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అనుమతులు లేని నిర్మాణాలను కూల్చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి శైలజ హయత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story