- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి వెనక ఎవ్వరు ఉన్నా వదలం..
దిశ ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనకు పాల్పడిన వారిని ఎవరిని వదిలేది లేదని, దాడిలో పాల్గొన్న వారు, దాడికి ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్ - 2 ఐజిపి వి.సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కడ చైర్మన్ వెంకట్ రెడ్డి మొదలగు అధికారుల పైన జరిగిన దాడి గురించి మల్టీ జోన్-2 ఐజిపి వి.సత్యనారాయణ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… లగచర్ల గ్రామంతో పాటు పరిసరాల ప్రాంతాలలో టిజిఐఐసి భూసేకరణలో భాగంగా ప్రజా అభిప్రాయం కొరకు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు, పోలీసు అధికారులు లగచెర్ల గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన మీటింగ్ స్థలంలో ఉన్నారు.
కలెక్టర్ మీటింగ్ లో ఉండగా బోగమోని సురేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి కుట్రపూరితంగా కలెక్టర్, అధికారులపైన దాడి చేస్తే గ్రామంలోకి భూసేకరణ అని మళ్లీ రారు అనే ఉద్దేశ్యంతో "కలెక్టర్ సార్ ఈ స్థలం గ్రామానికి దూరంగా ఉంది. గ్రామంలో చాలా మంది ఉన్నారు మీరు గ్రామంలోకి వచ్చి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి. వారు గ్రామంలో మీతో మాట్లాడటానికి వేచి చూస్తున్నారు" అని కలెక్టర్ కు చెడు ఉద్ధేశ్యంతో తెలిపారు. అలా కుట్రపూరితంగా కలెక్టర్ ఇతర అధికారులను గ్రామంలోని తీసుకెళ్లి రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడడం జరిగిందని ఐజిపి తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు కలెక్టర్, కడ అధికారి..
ఈ దాడిలో కడ చైర్మన్ వెంకట్ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లకు తీవ్రంగా గాయపడడం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఐజిపి తెలిపారు. అలాగే వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కి స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ దాడి సందర్భంగా బాధితుల ఫిర్యాదు మేరకు బొంరాస్పెట్ పోలీసు స్టేషన్లో 3 కేసులు నమోదు చేయడం జరిగింది. దాడిలో ప్రత్యేక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఐజిపి అన్నారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్, ఎస్బి ఇతర అధికారుల ద్వారా ఆధారాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. “ దాడికి ఉసిగొల్పిన ఎంతటి వారు అయిన సరే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 15 మందిని గుర్తించడం జరిగింది. దాదాపు 120 మందికి పైగా దాడిలో బాగస్తులయ్యారు. దాడిలో పాల్గొన్న వారిని వీడియోల ద్వారా గుర్తించామని, వాళ్ళ సెల్ ఫోన్ కాల్ డాటా ద్వారా వారిని ప్రేరేపించిన వారిని గుర్తిస్తున్నామని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవు. ఈ రాత్రికే అరెస్టులు చేయడం జరుగుతుందని మల్టీ జోన్-2 ఐజిపి వి.సత్యనారాయణ “ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఉన్నారు.