- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొలువుదీరిన నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గం
దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్న యాచించే వాడిగా కాకుండా శాశించే వాడిగా ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బంధు నిధులను నేరుగా అకౌంట్లలో వేపిస్తున్నారని అన్నారు. రైతులకు భరోసా కల్పించడానికి గుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఏలాంటి దరఖాస్తు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా 10రోజుల్లో 5లక్షలు రైతుభిమా అందిస్తుందన్నారు.
ప్రతి మండలానికి ఒక మార్కెట్ కమిటీ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు దండయాత్ర చేస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఉన్న పథకాలు, కేంద్రంలో అమలు చేస్తున్నారా అంటూ ఈ సందర్బంగా వారు బీజేపీని ప్రశ్నించారు. కుల, మతాల మధ్య చిచ్చుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మూఢ క్షుద్ర పూజల్లో మునిగిన బండి సంజయ్ కి మతి భ్రమించిందన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గా బేగరి నర్సింలు ఎన్నికయారు.
డైరెక్టర్లు బూర్ల సుమలత, బి.మహేష్, టీ.వెంకటయ్య, ఎంకమొళ్ళ కృష్ణ, కె.తిరుపతిరెడ్డి, జి.కరుణాకర్ రెడ్డి, ముధవార్ కృష్ణ నాయక్, ఎండీ.ఫయాజుదిన్, ఎస్.శ్రీనివాస్ గౌడ్, ఆర్.వెంకటేష్, కే.సతీష్ కుమార్, ఎం.చంద్రశేఖర్ రెడ్డి, ఎడి.రమాదేవి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మిరమణ రెడ్డి, జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, రామ్ రెడ్డి, పామేనా సర్పంచ్ మల్లారెడ్డి, దేవరపల్లి సర్పంచ్ నరహరి రెడ్డి, మడిమ్యాల సర్పంచ్ స్వర్ణలత దర్శన్, వైస్ ఎంపీపీ కర్నెశివప్రసాద్, టీఆర్ఎస్వీ నాయకులు నరేందర్ గౌడ్, పౌరసరఫరాల డైరెక్టర్ రవీందర్, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.