కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే శ్రీరాములు

by Sridhar Babu |
కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే  శ్రీరాములు
X

దిశ, మీర్ పేట్ : కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అందెల శ్రీ రాములు యాదవ్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 27 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్నర్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అందెల శ్రీ రాములు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా మార్చుకొని చూపిస్తుందని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మీర్ పేట్ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కోడూరు సోమేశ్వర్ , గాజుల మధు, కార్పొరేటర్లు భీమ్ రాజు, కీసర జమున కృష్ణారెడ్డి, పద్మ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయకులు స్థూల ప్రభాకర్, రాజశేఖర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి శ్రీనివాస్ రెడ్డి, శక్తి కేంద్రం సహ ఇంచార్జ్ నరేందర్ గౌడ్, అధ్యక్షుడు రుద్ర వెంకటేష్ , అధ్యక్షుడు మల్లోజుబాల చారి, తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షుడు రామన్న, ప్రగతి కాలనీ అధ్యక్షుడు మల్లేష్, చందు గోపాల్, శివకుమార్ చారి, రమేష్, దేవానంద్, శ్రీనివాస్ చారి, మధు రామచారి, రాము, భాస్కర్, గోపాల్, నరసింహ, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story