- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ శైలానికి పాదయాత్రతో శివస్వాములు..
దిశ, దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలం గుండేపల్లి గ్రామం నుంచి శివస్వాములు ఆదివారం శ్రీశైలానికి కాలినడకన బయలు దేరారు. గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శివమాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టుకుని గ్రామంలో నరహరి స్వామి ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించి శ్రీశైలానికి పాదయాత్రను ప్రారంభించారు.
నరహరి స్వామి మాట్లాడుతూ ఈ శివమాలధారణను స్వీకరించి నిష్టగా దీక్షను పూర్తిచేసుకున్న స్వాములపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్ని శ్రీశైలానికి పాదయాత్రతో వెళ్లడం గొప్ప విషయమన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో శివస్వాములు ఇంకా ఎక్కువమందితో పాదయాత్ర చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, శివస్వాములు, తదితరులు పాల్గొన్నారు.