- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kalwakurthy MLA : సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలి
దిశ,ఆమనగల్లు(కడ్తాల్ ): సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటి విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కడ్తాల్ మండలం గానుగుమాండ్ల తండాలో గిరిజనులు అతి పవిత్రంగా జరుపుకునే ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతులు సాంప్రదాయ నృత్యాలతో పాటు సాంప్రదాయ దుస్తులతో పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా రోజుల్లో ఉపయోగించే దుస్తులు కంటే పండగ వేళల్లో సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా దుస్తులు ధరించడం వల్ల దాని విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని అన్నారు.
శ్రావణమాసంలో తొమ్మిది రోజుల పాటు గిరిజన యువతులు సాంప్రదాయ పద్ధతుల్లో కుటుంబాలు బాగుండాలని ప్రార్థిస్తూ చివరి రోజున గోధుమ గడ్డి మొలకలు ప్రత్యేకత గా భావించి ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్ , అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, మండల అధ్యక్షులు బిచ్య నాయక్,నాయకులు భాస్కర్ రెడ్డి, హీరా సింగ్,లక్పతి నాయక్,మొత్య, హనుమాన్ నాయక్, హరిలాల్, గొప్య, రాజు తదితరులు పాల్గొన్నారు