ఫార్మావల్ల యువకులకు ఉపాధి అవకాశాలు.. ఎమ్మేల్యే, డీసీపీ

by Sumithra |
ఫార్మావల్ల యువకులకు ఉపాధి అవకాశాలు.. ఎమ్మేల్యే, డీసీపీ
X

దిశ, యాచారం : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మసిటీకి కట్టుదిట్టమైన భద్రత నేపద్యంలో యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ నూతనపోలీస్ స్టేషన్ ను ఆదివారం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహేశ్వరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ చింతమనేని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. పూజకార్యక్రమాల అనంతరం ఎమ్మేల్యే కిషన్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్ ఈ స్టేషన్ ఇంచార్జి బాధ్యతా ఎస్సై ఒర్సు ప్రసాద్ కి అప్పగించారు. స్టేషన్‌కు ఒక సీఐ, ఎస్సైలతో పాటు మరో 25 మంది కానిస్టేబుళ్లను నియమించారు. సీఐ, ఎస్సైలకు ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ పరిధిలోకి యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద, పిల్లిపల్లి, గొల్లగూడ, మంగలిగడ్డతండ, కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట, ఆకులమైలారం, పంజాగూడ, మాలగూడ, బేగరికంచ, వాయిల్లకుంటతండా, ముచ్చర్ల, ఉట్లపల్లి, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడ, పోతుబండతండా, కడ్తాల మండలంలోని పల్లెచెల్కతండాలతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్లే కిషన్ రెడ్డి మాట్లాడుతూ మేడిపల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం సంతోషకరమైన విషయం అన్నారు. ఫార్మసిటీ ప్రారంభమవుతే యువకులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. త్వరలోనే పర్మినెంట్ బిల్డింగ్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రదేశం అభివృద్ది దశలో నడుస్తుందని అన్నారు. ఫార్మసిటీలోనే మెడికల్ కాలేజీ రానుందని చెప్పారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో సీఎం, హోం శాఖమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, యాచారం సీఐ లింగయ్య, ఎంపీపీ కొప్పుసుకన్య, జెడ్పీటీసీ చిన్నొళ్ళ జంగమ్మ, ఎస్సైలు వెంకట్ నారాయణ, గోపాల్, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story