అగ్నివీర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

by Aamani |
అగ్నివీర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ
X

దిశ,సరూర్ నగర్ : సరూర్ నగర్ లో ఉన్నటువంటి నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ లో అగ్నివీర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అకాడమీ డైరెక్టర్ నందు నాయక్ తెలిపారు. గతంలో 2016 నుండి ఉచిత శిక్షణ ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించారని , ఆ విద్యార్థులు వివిధ విభాగాలలో ఆర్మీ, ఎసెస్సి జీడీ, ఆర్ పీ ఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎస్ ఐ, పోలీస్ కానిస్టేబుల్ లు గా ఎంపికయ్యారని అకాడమీ డైరెక్టర్ తెలిపారు.

ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల కలని నిజం చేయాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామని , ఆ దిశగా ఎంతో మందిని దేశ సేవకులు గా తీర్చిదిద్దటం ఆనందదాయకం అని అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ విద్యార్థులకు 1600 పరుగు కోసం ప్రత్యేక ట్రైనింగ్, ప్రాక్టీస్ ఎక్విప్మెంట్, పుల్ అప్ బార్ ఏర్పాటు చేశామని, పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తమ రిజల్ట్ షీట్ తీసుకుని వచ్చి జాయిన్ అవ్వచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్ కోరారు.

Next Story

Most Viewed