- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క సంతకానికి ఎనిమిది రోజులు..ఎఫ్ ఎస్సీ ఎస్ సొసైటీ అధికారులు చిన్న చూపు
దిశ,పెద్దేముల్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2లక్షల రుణమాఫీ చేయడంతో మరోసారి వారి వారి అవసరాల నిమిత్తం వివిధ బ్యాంక్ లలో మళ్ళీ రుణాలు తీసుకోవడానికి రైతన్నలు నిమగ్నమయ్యారు. ఏదైనా బ్యాంకులలో రుణాలు పొందాలంటే ఆ ప్రాంతం పరిధిలోని బ్యాంకులు రైతు సేవా సహకార సంఘం బ్యాంకులలో తమ దగ్గర రైతు కు సంబంధించి ఎలాంటి రుణాలు లేవు అని క్లియరెన్స్ కోసం సంబంధిత అధికారి సంతకం పెట్టాల్సి ఉంటుంది.
కానీ పెద్దేముల్ మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం, ఎఫ్ఎస్సీఎస్ సొసైటీ అధికారులు మాత్రం ఒక్క సంతకానికి వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని రెైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెైతులను చిన్న చూపు చూసి నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం, ఎఫ్ఎస్సిఎస్ సొసైటీ లో రెైతులకు సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు.