- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ వర్షాలకు మేడికుంట చెరువుకు గండి
దిశ, ఆమనగల్లు : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని మేడికుంట చెరువు నిండి కుంటకు గండి పడింది. దీంతో వర్షపు నీరు సమీప వ్యవసాయ పొలాల మీదుగా వృథాగా పోతుంది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్,నాయకులు రాంచందర్ నాయక్, రవినాయక్ మేడికుంటను పరిశీలించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి కుంటకు గండి పడిన విషయమై సమాచారమిచ్చారు. మేడి కుంటకు మరమ్మతులు
చేయకపోవడంతో గండి పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. చెరువు నిండితే సమీప వ్యవసాయ పొలాల్లోని బోరుబావులలో నీటి మట్టంపెరిగి, సేద్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చెరువుకు గండి పడటంతో నీరు అంతా వృథాగా పోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కుంటకు త్వరగా మరమ్మతులు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు కుంటకు పడిన గండిని పూడ్చాలని రైతులు వేడుకుంటున్నారు.
- Tags
- Medikunta Pond