‘దిశ’ ఎఫెక్ట్ .. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

by Aamani |
‘దిశ’ ఎఫెక్ట్ .. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
X

దిశ, తాండూరు : తాండూరు పట్టణం లారీ పార్క్ ఎదురుగా ఉన్న సుమారు రూ. 25 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం తహసీల్దార్ తారా సింగ్ తెలిపారు. ఈనెల 20వ తేదీ "రూ.25కోట్ల స్థలం స్వాహా! అనే శీర్షికతో దిశ దిన పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే.అలాగే పలు దినపత్రికల్లో కూడా వార్త కథనాలను ప్రచురించారు.తెలిసిందే.మాజీ కౌన్సిలర్ సూరజ్ సింగ్ ఠాగూర్ ఆధారులతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తాండూరు తాసిల్దార్ తారా సింగ్ ఆదేశాలతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపి, సర్వే అధికారి మహేష్ లు కలిసి 130 సర్వే నెంబర్ లో జాయింట్ సర్వే చేశారు.

అధికారులు సర్వే చేయడం తో సర్వే నెంబర్ లో 36 గుంటల స్థలం ఉన్నట్లు గుర్తించారు.స్థలాన్ని గుర్తించి హద్దులు పాతారు. ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించి 36 గుంటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారా సింగ్ మాట్లాడుతూ.. ఈ స్థలం చుట్టూ కంచె వేయడానికి ఎస్టిమేట్ తయారు చేస్తున్నామన్నారు. తొందరలో కంచె వేసి ప్రభుత్వ భూమి అని బోర్డును పెడతామని చెప్పారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న నివేదికను జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు పంపిస్తామన్నారు.ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరిమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed