Ayushman Bharat: ప్రధాని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు: టీఎంసీ

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-30 17:42:28.0  )
Ayushman Bharat: ప్రధాని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు: టీఎంసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌(Ayushman Bharat)ను 70 ఏళ్లు పైబడినవారందరికీ వర్తించే నిర్ణయాన్ని అమలు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఇటీవలే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రాలు స్వార్థపూరిత, రాజకీయ కారణాలతో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ టీఎంసీ తన వైఖరిని సమర్థించుకుంది. ఆయుష్మాన్ భారత్‌కు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వాస్థో సాతికి మధ్య తేడాలను తాము రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కౌంటర్ ఇచ్చింది. తమ పథకంతోనే పేదలకు ఎక్కువ ప్రయోజనాలున్నాయని వివరించింది. ఆయుష్మాన్ భారత్‌కు సగం నిధులు రాష్ట్రం నుంచే వస్తున్నాయని, అయినా.. ఆ పథకం అందరికీ వర్తించడం లేదని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. కారు, స్మార్ట్‌ఫోన్లు లేని కుటుంబాలను ఆయుష్మాన్‌కు దూరం పెట్టారని ఆరోపించారు. కానీ, తమ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ వర్తించేలా రూపొందించామని వివరించారు.

తాము ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని ప్రధాని చెప్పారని, ఆ వ్యాఖ్యలపై ఆయనే మరింత స్పష్టత ఇవ్వాలని కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కిసాన్ బీమా యోజనా పథకాన్ని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వమే అమలు చేస్తున్నదని, దీదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సేవల చేయడానికేనని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed