Trending: బ్లింకిట్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం.. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేస్తే వచ్చిన డెలివరీ చూసి ఖంగుతిన్న వ్యక్తి

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-31 10:59:33.0  )
Trending: బ్లింకిట్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం.. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేస్తే వచ్చిన డెలివరీ  చూసి ఖంగుతిన్న వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: ధనత్రయోదశి(Dhanathrayodashi) సందర్భంగా కస్టమర్లకు పసిడి(Gold), వెండి(Silver) నాణేలను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేసే సదుపాయాన్ని పలు క్విక్ కామర్స్(Quick Commerce) సంస్థలు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్ లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారునికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. మోహిత్ జైన్(Mohit Jain) అనే వ్యక్తి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్(Malabar Gold and Diamonds) నుంచి బ్లింకిట్(Blinkit) ద్వారా 24 క్యారెట్ల 1 గ్రామ్ లక్ష్మి గోల్డ్ కాయిన్, 10 లక్షి గణేష్ సిల్వర్ కాయిన్ ఆర్డర్ చేశారు. అయితే తనకు 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ మాత్రమే డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్ (X)'లో షేర్ చేశారు. బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ ఆర్డర్ చేసిన కాయిన్లను డెలివరీ చేసే సమయానికి నేను ఇంట్లో లేను, ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడిని పంపించి ఓటీపీ చెప్పి తీసుకోమన్నాను. 20 నిమిషాల తర్వాత నేను ఇంటికి చేరుకున్నాను. ఆ తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంది. దీంతో నేను షాక్ కి గురయ్యానని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

దీంతో ఆర్డర్ రిటర్న్ చేద్దామనుకుంటే.. రిటర్న్ విండోను క్లోజ్ చేశారు. నేను ఏ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ని సంప్రదించలేకపోయా. డెలివరీ ఏజెంట్ కు కూడా కాల్ చేశా. కానీ తానేమి హెల్ప్ చేయలేనని చెప్పాడని సదరు కస్టమర్ తెలిపాడు. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన వస్తువులను బ్లింకిట్ నుండి ఆర్డర్ చేయడం ఇదే తొలిసారని, డెలివరీకి సంబంధించిన సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయని అతడు పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆన్‌లైన్ లో జరుగుతున్న మోసాలపై మండిపడ్డారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed