Prashant Kishor : కులానికి, ఉచితాలకు ఓటు వేయొద్దు : ప్రశాంత్ కిశోర్

by Hajipasha |
Prashant Kishor : కులానికి, ఉచితాలకు ఓటు వేయొద్దు : ప్రశాంత్ కిశోర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కులం సెంటిమెంట్‌తో, ఉచితాల ఆశతో ఓట్లు వేయొద్దని ప్రజలకు జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) పిలుపునిచ్చారు. ‘‘కులం సెంటిమెంట్‌తో గెలిచి లాలూ, నితీశ్‌‌లు 35 ఏళ్ల పాటు బిహార్‌(Bihar)ను దగా చేశారు. 5 కేజీల ఉచిత బియ్యం లాంటి పథకాల పేరుతో బీజేపీ గెలిచి పదేళ్లు పాలించింది. మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కులం, ఉచితాల పట్టింపును వదిలేయండి’’ అని పీకే కోరారు.

బిహార్‌లో ఉప ఎన్నిక జరగనున్న రాంఘర్ అసెంబ్లీ స్థానంలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రశాంత్ కిశోర్ బుధవారం ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేస్తే.. మళ్లీ నితీశ్ కుమార్‌ను బలపర్చినట్టు అవుతుందని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాంఘర్ స్థానంలో ఆర్‌జేడీ గెలిచింది. దీంతో ఈసారి కూడా ఈ స్థానాన్ని గెల్చుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. ఇక అధికార జేడీయూ, బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు.

Next Story

Most Viewed