- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా
by Nagam Mallesh |
X
దిశ, మొయినాబాద్ః అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఆదివారం వెస్ట్ సైడ్ వెంచర్ లో అలాగే గండిపేట చెరువు ఎఫ్ టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ నిర్మాణాలను కూల్చి వేశారు. ప్రభుత్వ భూముల్లో మరియు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. హైడ్రాధికారులు ఏఈ మల్లికార్జున్ వాటర్ వర్క్స్ విజిలెన్స్ హెచ్ఎండిఏ సీఐ అధికారి లక్ష్మీరెడ్డి, మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్యన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story