- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చొక్కంపేట ఆంజనేయులుకు దళితరత్న అవార్డు..
దిశ, షాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే మహనీయుల ఉత్సవాల సందర్బంగా దళిత ఉద్యమకారులను గుర్తించి తగిన గుర్తింపుగా దళిత యువరత్న, దళితరత్న అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా మాలసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తున్న చొక్కంపేట ఆంజనేయులును గుర్తించి దళితరత్న అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సీబీఎతుల మీదుగాడివరం రోజు నగరంలోని ఆమె నివాసంలో అందించడం జరిగింది.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటు, ముఖ్యంగా దళిత సమాజిక వర్గానికి అనేక రకాల సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలిపారు. అలాగే దళితరత్న చొక్కంపేట ఆంజనేయులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి దళితరత్న అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలంగాణ పభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ అవార్డును అందించి రాష్ట్ర ప్రభుత్వం మరింత బాధ్యతలను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మహనీయుల ఉత్సవాల కమిటీ మాజీ చైర్మన్ రావుల విజయ్ కుమార్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంక ప్రభాకర్, జిల్లా ప్రధానకార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.