- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sabitha indra reddy : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గిరిజన వ్యతిరేకులు
దిశ,మహేశ్వరం: కాంగ్రెస్,బీజేపీ పార్టీలు గిరిజన వ్యతిరేక పార్టీలని ,గిరిజనుల పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండలంలోని డబిల్ గూడ, మన్సాన్ పల్లి, ఉప్పుగడ్డ తండా, కొత్త తండా ,కేబీతండా, గంగారం, సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులన్నారు. బీజేపీ అభ్యర్థి కులమతాల పేరుతో వస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులతో వచ్చిన మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మే స్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పిలిస్తే పలికే నేత సబితమ్మకు పట్టం కట్టాలన్నారు.
ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఇంచార్జీ ఎంపీపీ సునీత ఆంధ్యనాయక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చిలకమర్రి నర్సింహ, మండల అధ్యక్షుడు రాజు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, సర్పంచులు కంది అరుణ రమేష్, సాలి వీరనాయక్, నాయకులు అంజయ్య ముదిరాజ్,మల్లేష్ యాదవ్, కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్,మద్ది కరుణాకర్ రెడ్డి,దయ్యాల శ్రీనివాస్,పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.