- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
survey : ఇంటింటి సర్వేతో కులగణన..
దిశ, రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటింటి సర్వేకు జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఇంటింటి సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటి సర్వేతో కులగణన పూర్తి చేయనున్నది. అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగానే రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. అందుకు అనుగుణంగానే సిబ్బందిని, అధికారులను నియమించింది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. 6, 7, 8వ తేదీ వరకు ఇంటింటికీ స్టిక్కర్.. ఆ తర్వాత తొమ్మిది రోజులు ప్రభుత్వం రూపొదించిన 74 ప్రశ్నలకు సమాధానం సేకరించి సంబంధిత అధికారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ప్రైమరీ స్కూల్స్ మూసివేయాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనల్లో ప్రైమరీ స్కూల్స్‌లో పనిచేసే ఎస్జీటీలు పాల్గొనాలని సూచించింది. అయితే రంగారెడ్డిలోని 886, వికారాబాద్‌లోని 722 స్కూల్స్ ఒక్కపూట నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డిలోని 21 56, వికారాబాద్‌లోని 1791 మంది ఎస్జీటీ టీచర్లు సర్వేలో పాల్గొననున్నడంతో స్కూల్ మూసివేసే పరిస్థితి వచ్చింది. దీంతో విధుల్లో పాల్గొనే టీచర్లు 12 రోజుల పాటు మధ్యాహ్నం పూర్తిగా స్కూల్స్ బంద్ చేయడంతో స్థానికుల్లో వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ప్రైమరీ స్థాయిలో విద్యను బోధించే టీచర్లు విధుల్లో పాల్గొనడం, ప్రభుత్వ ఆదేశాలతో సర్వేలో పాల్గొంటే స్కూల్స్ మూతపడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒక ఎన్యూమరేటర్‌కు 150కి పైగా ఇండ్లు..
రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 549 గ్రామ పంచాయతీలు, వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 4 మున్సిపాలిటీలు, 560 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ జిల్లాల్లోని ప్రతి ఇంటిలోని కుటుంబం సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే 150 నుంచి 175 ఇండ్ల వరకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమిస్తూ సర్వే చేయనున్నారు. బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఈ సర్వే నడవనుంది. ప్రతి కుటుంబ యజమానిని నేరుగా ఎన్యుమరేటర్ కలిసి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సేకరించిన సమాచారం మొత్తం ఈ నెల చివరి నాటికి కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని మండల అభివృద్ధి అధికారులు అప్పగించారు.