అసలేమయింది ఈ ఆమనగల్లుకు..

by Sumithra |
అసలేమయింది ఈ ఆమనగల్లుకు..
X

దిశ, ఆమనగల్లు : నాలుగు మండలాలకు కూడలిగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చేరువలో ఉన్న ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనకబడింది. తమ స్వార్థ రాజకీయాల కోసం ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ లోపం, స్వార్థ రాజకీయాలు అభివృద్ధికి శాపంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, మున్సిపాలిటీ పాలకవర్గం బీజేపీ ఉండడంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోటాపోటీ విమర్శలు తప్ప టీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ ప్రతిపాదన 7 సంవత్సరాల నుండి కలగానే మిగిలింది. ఇరుకు రోడ్ల మధ్య వారాంతపు సంత కొనసాగుతోంది. సుర సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. హైదరాబాద్ శ్రీశైలం రహదారి సెంట్రల్ లైటింగ్, జంక్షన్ ఏర్పాటు, సిగ్నల్ ఏర్పాటు కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరుగుతోంది. ఈ సమస్యల పరిష్కరానికి బీజేపీ, టీఆరెఎస్ నాయకులు సమన్వయంతో వ్యవహారించాలని పట్టణ ప్రజలు అంటున్నారు. లేకపోతే రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెపుతామని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story