అల్యూమినియం షీట్స్ దొంగల అరెస్టు

by Kalyani |
అల్యూమినియం షీట్స్ దొంగల అరెస్టు
X

దిశ, మహేశ్వరం: గుట్టుచప్పుడు కాకుండా అల్యూమినియం షీట్స్ ఎత్తికెళ్ళిన పది మంది దొంగలను మహేశ్వరం పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్ తరలించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ కు చెందిన కురువ రాము (20),కొత్త కురువ అనిల్ (22),బోయ అనిల్ (22),కురువ శివ (19), కోరి అనిల్ (20),మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం జూరాల డ్యామ్ గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ (21),సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి చెందిన కొనవేని రాకేష్ (28), కొహెడ మండలం తడిశెట్టి శ్రీధర్ (30),కర్ణాటక గుల్బర్గా జిల్లా షాదిపూర్ చెందిన నూతన్ రాథోడ్ (29), చించోలి గ్రామానికి చెందిన రాథోడ్ సునీల్ (27) మహేశ్వరం మండలంలో పగటిపూట ఎవరు ఉండన్ని వెంచర్లు, విల్లాలను చూసేవారు. వెంచర్లలల్లో విలువైన స్టీల్స్,ఇనుప వస్తువులను చూసి గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నారు.

మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిగిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో వండర్ బిల్ట్ గ్రూప్ విల్లాల్లో ఈ నెల 17 తేదీన 50 అల్యూమినియం షీట్స్ ,23 తేదీన 50 అల్యూమినియం షీట్స్, శనివారం (26 తేదీన) తెల్లవారుజామున 5 ఐదు గంటల సమయంలో 19 అల్యూమినియం షీట్స్ ను టాటా మెగా ఆటోలో (టిఎస్ 07- యూఈ -7830) తరలిస్తుండగా మన్సాన్ పల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద అల్యూమినియం షీట్స్ తో వెళ్తున్న ఆటోని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహేశ్వరం పోలీసులు పట్టుకున్నారు.అల్యూమినియం షీట్స్ ను ఇనుప సామాన్ (స్క్రాప్) దుకాణలలో అమ్మేశారు. కరగబోసిన అల్యూమినియం ద్వారా వచ్చిన నగదు రూ. 9,70,000 ,19 అల్యూమినియం షీట్స్ ని, ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లాస్,వెంచర్లు ఏర్పాటు చేసేవారు తమ స్థలాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ లక్ష్మీకాంతా కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్ రెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story