- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చిన వాగ్దనాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం : కేసీఆర్
దిశ, రంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధనాలు అమలు కావాలంటే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం కావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దయచేసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. చేవెళ్ల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా గర్జన బహిరంగ సభలో శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శనివారం ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి.. పోతాయి... అధికారంలో ఏ పార్టీలైన ఉండోచ్చు... కానీ ప్రజలకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైన ప్రజలకు ధీమా కల్పించడంలో విఫలమైయిందని కేసీఆర్ విమర్శించారు.
ప్రతి ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని సూచిస్తున్నానని అన్నారు. అయినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుకానీ హామీలు, ప్రలోభాలకు లోనై ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైన చిత్తశుద్దితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ది చేసి కాంగ్రెస్కు అప్పిగించిందన్నారు. అయినప్పటికి కేసీఆర్ పక్కకు పోయిన వెంటనే తాగు, సాగు నీటి కష్టాలు, కరెంట్ కోతలు ఎందుకు వచ్చాయని కాంగ్రెస్ను ప్రశ్నించారు. రైతులకు కులం, మతంతో సంబంధం లేదన్నారు. అలాంటి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, కరెంట్ కోతలు, సాగు నీటి కష్టాలు రాకుండా సేవలందించిందన్నారు. అంతేకాకుండా జ్యోతిరావు బాపు పూలే, అంబేద్కర్ సూచించిన బాటల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం నిరంతరం బీఆర్ఎస్ పనిచేసేందన్నారు.
విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఒవర్సీస్ స్కాలర్షీప్ పథకాలు అందుబాటులోకి తీసుకోచ్చామని తెలిపారు. దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, కుల వృత్తుల అభివృద్దికి చేయూత పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ కాదా అని ప్రజలను కేసీఆర్ అడిగారు. ఈ పథకాలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి ప్రజలను మోసం చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. 1.30లక్ష మంది దళితులకు మంజూరైన దళిత బంధు పథకం అమలైయ్యేందుకు అబేంద్కర్ విగ్రహాం వద్ద దీక్ష చేస్తానని కాంగ్రెస్ను కేసీఆర్ హెచ్చారించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో... 11 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతున్నాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందామని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందన్నారు. కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు అమలు చేయకపోయిన పర్వాలేదు గానీ గత ప్రభుత్వంలో కొనసాగించిన విధానాలను కొనసాగించడంలో విఫలమైయిందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్ధానాలను గెలిస్తే రాష్ట్రంలోని ప్రజలకు అండగా ఉంటామని కేసీఆర్ పిలుపునిచ్చారు. నా గొంతులో ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షానే కోట్లాడుతాను... మౌనంగా ఉండనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ పుణ్యాన ఎంపీగా గెలిచిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన ఇద్దరిని ఎంపీలుగా గెలిపించింది నేనే అని తెలిపారు. అవకాశం కోసం పార్టీల మారే వారికి బుద్ది చెప్పాలని కేసీఆర్ చేవెళ్ల ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలతో భయబ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. కేవలం మోడీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ప్రజలను ఆందోళన గురి చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయాల కోసమే ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తోందన్నారు. కానీ రాష్ట్రాల అభివృద్ధికి ఏలాంటి సహకారం అందించలేదన్నారు.
నవోదయ స్కూల్స్, మెడికల్ కాలేజీలు, ఐటీఐఆర్, ఖమ్మం జిల్లాలోని మూడు మండలాలను, సీలేర్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతుల పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నూకలు ఇవ్వండి మీ ప్రజలకు అని ఉచిత సలహా ఇచ్చిందన్నారు. మనల్ని నూకలు తినమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు. దేశంలో 30లక్షల ఉద్యోగులు ఖాళీగా ఉంటే భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్, బయ్యరం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమారు–రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడంలో బీజేపీ మొండి చెయ్య చూపించిందన్నారు. ఇలాంటి బీజేపీ పార్టీకి ఓటు వేసి తప్పు చేయోద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీసీలకు నిజంగా దమ్ముంటే కాసానీ జ్క్షానేశ్వర్ను గెలిపించుకోవాలని ఓ నాయకుడు సవాల్ విసిరారు. ఆ సవాలును చేవెళ్ల ప్రజలు స్వీకరించి కాసాని గెలుపు... బీసీలకు మలుపు కావాలని సూచించారు. ఈ సభలో బీఆర్ఎస్ అభ్యర్ధి కాసానీ జ్క్షానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.