- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rangareddy: గంజాయి ముఠా హల్‌చల్.. మార్నింగ్ వాకర్స్‌పై దాడి
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో గంజాయి ముఠా హల్‌చల్ చేశారు. తెల్లవారుజామున గంజాయి సేవించిన మత్తులో మార్నింగ్ వాకర్స్ పై దాడికి తెగబడ్డారు. ఘటన ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో ఓ ఐదుగురు సభ్యుల గ్యాంగ్ గంజాయి మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తున్న వారిపై దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. అంతేగాక ఈ దాడిని అడ్డుకోబోయిన స్థానికులను సైతం కర్రలతో కొట్టారు. పార్కింగ్ చేసి ఉన్న వాహానాల అద్దాలు ధ్వంసం చేస్తూ.. వీరంగం సృష్టించారు. వీరంతా గత కొద్దికాలంగా దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నారని, వచ్చే పోయే వారిని బూతులు తిడుతూ.. దాడికి తెగబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కుటుంబంతో బయటికి రావాలంటే భయంగా ఉందని, పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేగాక ఈ గంజాయి ముఠా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులు చొరవ తీసుకొని గంజాయి గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.