Ramoji Rao : రామోజీరావును వారే హింసించి హత్య చేశారు: వీహెచ్

by Mahesh |   ( Updated:2024-06-08 13:57:54.0  )
Ramoji Rao : రామోజీరావును వారే హింసించి హత్య చేశారు: వీహెచ్
X

దిశ, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారనే వార్త తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4.50 ఆయన తుదిశ్వాస విడవ గా.. 10 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు. అలాగే తన అభిమానుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్(హనుమంతరావు) రామోజీరావు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు సాదరణంగా చనిపోలేదని.. ఆయన్ను మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల పేరుతో హింసించి హత్య చేశారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం దారుణమని.. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాను ఆనాడే వ్యతిరేకించానని.. తెలిపారు. జగన్ ప్రభుత్వం రామోజీరావును హింసించినందువల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా గత ప్రభుత్వ రామోజీరావును హింసించిందని.. 88 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి ఎమర్జేన్సీ బెడ్ పై చికిత్స పొందుతున్నప్పటికి విచారణ పేరుతో రాజకీయం చేశారని.. వారికి దేవుడు తగిన బుద్ది చెప్పారని.. తనను హింసకు గురి చేసిన వ్యక్తి అంతం చూసాకే రామోజీరావు కన్నుమూశారని మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story

Most Viewed