Ramoji Rao: పత్రికా రంగంలో విప్లవం తీసుకొచ్చిన రామోజీరావు

by Mahesh |   ( Updated:2024-06-08 13:59:53.0  )
Ramoji Rao: పత్రికా రంగంలో విప్లవం తీసుకొచ్చిన రామోజీరావు
X

దిశ, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు(88) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న ప్రముఖుల ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. కాగా రామోజీరావు..1936 నవంబర్‌ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి లో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. కాగా రామోజీరావు తెలుగు పత్రికా రంగంలో విప్లవం తీసుకొచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో ఈ టీవీ ఛానల్ ను ప్రారంభించారు. 2003లో టీటీవీ-2 పేరిటీ తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల వార్తా ఛానల్ ను పరిచయం చేశారు. అలాగే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మార్పులు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఈనాడు వార్తలకు బ్రాండ్ గా నిలిచాయి. నేటికి కూడా ఈ రెండింటిలో వస్తే తప్ప వార్తలను నమ్మలేమని చెప్పే వారు కూడా ఉన్నారంటే ఈనాడు గ్రూప్స్ ప్రజల్లో ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది.

Advertisement

Next Story