రోల్స్ రాయిస్ కారు కొన్న రామ్ చరణ్.. హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో సందడి (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-22 12:46:44.0  )
రోల్స్ రాయిస్ కారు కొన్న రామ్ చరణ్.. హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో సందడి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు(Rolls Royce Car)ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయా(Khairtabad RTO Office)నికి మంగళవారం వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం అధికారులంతా రామ్ చరణ్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా, కోట్లు వెచ్చించే సంపద ఉన్నా సరే అందరికీ రోల్స్ రాయిస్‌‌ను ఆ కంపెనీ అమ్మదు అనేది సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం. ఇందుకు రోల్స్ రాయిస్ కంపెనీ పాటించే నిబంధనలే అని అంటుంటారు.

ఏళ్లుగా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బ్రాండ్‌ను కాపాడుకుంటూ వస్తున్నట్లు సమాచారం. రోల్స్ రాయిస్ షోరూంలో కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి వివరాలను కంపెనీ ప్రతినిధులు ఆరా తీస్తారు. అందులో పాసైతే(అర్హత ఉందని తెలిస్తే)నే కొనే అవకాశాలుంటాయని సోషల్ మీడియాలో ఉన్న చర్చ. కొనుగోలు చేసే వారి ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, పెండింగ్ లోన్స్, ఇతర రుణాల వివరాలు, చేస్తున్న వృత్తి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు సమర్పించాలి. ప్రస్తుతం ఈ రోల్స్ రాయిస్ కారు ఇండియాలో అతి తక్కువ మంది వద్ద ఉంది. అందులో మెగాస్టార్ చిరంజీవి వద్ద కూడా ఉన్న సంగతి తెలిసిందే.


Advertisement

Next Story