జాతీయ స్థాయిలో సంస్థను బలోపేతం చేస్తాం: రాజేంద్ర పల్నాటి

by GSrikanth |
జాతీయ స్థాయిలో సంస్థను బలోపేతం చేస్తాం: రాజేంద్ర పల్నాటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ సంస్థను బలోపేతం చేయనున్నామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్​జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పల్నాటి చెప్పారు. సంస్థ సలహాదారుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ అవినీతి రహిత సమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. పన్నెండు సంవత్సరాలుగా దేశంలో వినూత్న కార్యక్రమాలతో పని చేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కొత్త కమిటీలను శనివారం నియమించారు.

సంస్థ సలహాదారులు శ్రీనువాస్ మాధవ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడిగా రాజేంద్ర పల్నాటి, గౌరవ కార్యదర్శిగా వాసిరెడ్డి గిరిధర్, జాతీయ కార్యవర్గ సభ్యులుగా కోమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, జి.హరిప్రకాశ్, అంజుకర్, జయరాం, ప్రదీప్ రెడ్డి, రమేశ్ నాయక్, చెరుకూరి జంగయ్య, సురేంద్ర ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులుగా కొన్నె దేవేందర్, మారియా అంతోని, బి.రాజేశ్, పిడమర్తి స్నిగ్ధ, బి.శ్రీజ, మంత్రి భాస్కర్, చింత శ్రీనువాస్, తెలంగాణ సలహాదారులుగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, కానుగంటి రాజు, డాక్టర్ స్రవంతి, డాక్టర్ అన్నపూర్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా గంట గీత, సత్తార్, డాక్టర్ శ్రీవాణి, ప్రసన్న లక్ష్మి, నిహారిక, ఝాన్సీ, సునిత, సంతోషిణి, ప్రగతి, నాగేంద్ర, చింతల్ రమేశ్, శ్రీనువాస్ రావు, లీగల్ కమిటి కార్యదర్శులుగా కొల్లె భవాని, పంతగాని లక్ష్మికళ, మణిదీప్, మీడియా కార్యదర్శిగా జయరాం, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా శ్రీనివాసరావు, సంపత్, హరిలను నియమించారు.

జాతీయ సలహాదారులుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, మాజీ ఆర్టీఐ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, ఐపీఎస్ అధికారి రాజు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు మరి కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సలహాదారులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల కమిటీలను, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలను మార్చిలో నియమించనున్నారు.

Advertisement

Next Story