మిషన్ భగీరథ నీటిలో వాన పాములు.. ఆందోళన చెందుతోన్న ప్రజలు

by Anjali |
మిషన్ భగీరథ నీటిలో వాన పాములు.. ఆందోళన చెందుతోన్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనాలకు పరిశుభ్రమైన నీరును అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్ భగీరథ నీటి సరఫరా స్కీం అధికారుల నెగ్లిజెన్సీతో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదు. నల్లాల ద్వారా సరఫరా అవుతోన్న వాటర్‌లో వానపాములు అదృశ్యమవుతున్నాయి. తాజాగా తాండూరు పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ అనురాధ ఇంట్లో భగీరథ నీటిని కుళాయి ద్వారా పట్టగా.. అందులో కొన్ని వాన పాములు వచ్చాయి. దీంతో ఆమె ఆందోళన చెందింది. అనురాధ.. భర్త రవీందర్‌కు చూపించింది. అధికారుల నిర్లక్ష్యంతోనే భగీరథ నీటిలో ఇలాంటివి వస్తున్నాయని వారు వాపోయారు. ఇలాంటి నీరును వదిలితే ప్రజల ఆరోగ్యం ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. అసలే వానాకాలంలో జనాలు ఈ నీటిని తాగితే రోగాల బారిన పడుతారని వాపోతున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలో పలు కాలనీల్లో మురుగునీరు వస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed