- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన పోస్టల్ శాఖ.. ఇక ఆ సేవలు ఇంటి నుంచే
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు (Retired employees of Govt) తపాలా శాఖ (Postal Department) భారీ గుడ్ చెప్పింది. ఇక నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (Digital life Certificate) పొందే సౌకర్యాన్ని మరింత సులభతరం చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులతో పింఛన్ తీసుకునే వారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ (India Post Payments) బ్యాంకు ద్వారా ఇక నుంచి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (Digital life Certificate) పొందేలా అవకాశం కల్పించారు. అయితే, అందుకు పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వారి సమీప పోస్టాఫీస్ (Post Office)లో లేదా పోస్ట్‌మ్యాన్(Post Man)కు రూ.70 ఫీజు చెల్లించాలి. అదేవిధంగా పింఛన్‌దారుల ఆధాన్ నెంబర్ (Aadhar Number), మొబైల్ నెంబర్, PPO నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాల (Bank Account Details)తో పాటు థంబ్ ఇప్రెషన్ (Thumb Impression)తో వేలిముద్ర తీసుకుని నిమిషాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (Digital life Certificate) ఇచ్చేస్తారు.
కాగా, పెన్షనర్లు ప్రతి ఏటా నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (Digital life Certificate) సబ్‌మిట్ చేయడం తప్పనిసరి. లేని పక్షంలో వారి పెన్షన్ అధికారులు నిలిపివేస్తారు. ఈ క్రమంలోనే లైఫ్ సర్టిఫికెట్ పద్ధతిని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి పెన్షనర్లకు అవగాహన కల్పిస్తుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి అంటూ దేశ వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఎవరైతే 2022 నాటికి పింఛన్‌దారులు ఉన్నారో వారందరికీ ఇంటి వద్దకే వేలిముద్ర ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్(Digital life Certificate)లను అందించేందుకు 29 నవంబర్ 2022న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో ఒప్పందం కుదిరింది.