Demonte Colony 2: దీపావళి రోజున టీవీలో సందడీ చేయబోతున్న 'డీమాంటే కాలనీ2'

by Prasanna |
Demonte Colony 2: దీపావళి రోజున టీవీలో సందడీ చేయబోతున్న డీమాంటే కాలనీ2
X

దిశ, వెబ్ డెస్క్ : 'డీమాంటే కాలనీ' (Demonte Colony 2)సినిమాని ఇష్ట పడని వారంటూ ఉండరు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ గా 'డిమాంటే కాలనీ 2' కూడా తీశారు. తమిళ్ హీరో అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ జోడిగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

8 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ మూవీ 'తంగళన్' వంటి పెద్ద సినిమాలకి పోటీగా నిలబడి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

'డీమాంటే కాలనీ 2'( Demonte Colony 2) దీపావళికి టీవీలో సందడి చేయనుంది. అక్టోబర్ 31న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది. థియేటర్లో చూడని వారు టీవీలో చూడొచ్చు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను 'జీ5' సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా 'డీమాంటే కాలనీ 2' హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ మూవీ ఆగస్టు 23న రిలీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed