Janhvi Kapoor: ఐ మిస్ మై బేబీస్ అంటూ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించంటే..?

by Kavitha |
Janhvi Kapoor: ఐ మిస్ మై బేబీస్ అంటూ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించంటే..?
X

దిశ, సినిమా: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ఈ భామ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన రెండు కుక్క పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ.. ఐ మిస్ మై బేబీస్ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు నువ్వు కుక్క పిల్లలను మిస్ అవుతుంటే మేము నిన్ను మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story