Medchal : ప్రేమజంట సూసైడ్ కేసు.. నిందితుడి అరెస్ట్

by M.Rajitha |
Medchal : ప్రేమజంట సూసైడ్ కేసు.. నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఘట్ కేసర్లో సూసైడ్ చేసుకున్న ప్రేమజంట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రపజుల క్రితం ఘట్ కేసర్ పరిధిలో ఓ ప్రేమ జంట కారులో పెట్రోల్ పోసుకొని సజీవ దహనం చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ అనే వ్యక్తి ప్రేమజంటను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయగా.. మరోవైపు ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోక పోవడంతో.. ఆ జంట సజీవ దహనానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు మహష్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బుధవారం మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed