Mumbai: నాన్ వెజ్ తినొద్దని బాయ్ ఫ్రెండ్ వేధింపులు.. ఎయిరిండియా పైలట్ ఆత్మహత్య

by Shamantha N |
Mumbai: నాన్ వెజ్ తినొద్దని బాయ్ ఫ్రెండ్ వేధింపులు.. ఎయిరిండియా పైలట్ ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో(Mumbai)ఎయిరిండియా పైలట్(Air India pilot) సృష్టి తులి ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. అయితే, ఈ కేసులో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆదిత్య పండిట్ ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడిపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమార్తెను నాన్-వెజ్ తినొద్దని, మానేయాలని అతడి వేధింపులకు గురిచేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే, సృష్టి బంధువు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గతేడాది నవంబరులో తన కారులో కుమార్తె రాశి, సృష్టిలను ఢిల్లీలో షాపింగ్‌కు తీసుకెళ్లాడని అన్నారు. అప్పుడు ఇరువురి మధ్య గొడవ జరగిందని.. సృష్టిని ధూషించినట్లు తెలిపారు. ఆ కోపంలో కారుని వేరే వెహికిల్ తో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. అలానే, ఈ ఏడాది మార్చిలోవారి స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం గురుగ్రామ్‌లోని హోటల్‌కు వెళ్లినప్పుడు కూడా దారుణంగా మాట్లాడాడని ఆరోపించారు. ఆమె ఆహారపు అలవాట్ల గురించి అవమానించాడని చెప్పారు. నాన్-వెజ్ తింటుందని అవమానించాడని అన్నారు. తర్వాత రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయాడని వివరించారు. ఈ సంఘటనల అనంతరం ఆదిత్యతో రిలేషన్‌షిప్ సజావుగా సాగడం లేదని తన కుమార్తె రాశికి చెప్పి సృష్టి వాపోయిందని వివేక్ తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆదిత్యపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్‌లోని( Uttar Pradesh) గోరఖ్ పూర్ కు చెందిన ఎయిరిండియా పైలట్ సృష్టి తులి (25) అంధేరీలోని కణిక రెయిన్‌ఫారెస్ట్ అపార్ట్‌మెంట్‌లో గత జూన్ నుంచి అద్దెకు ఉంటోంది. కాగా.. సోమవారం తెల్లవారుజామున ఆమె డేటా కేబుల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తోన్న ఆదిత్యకు ఫోన్ చేసిన సృష్టి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ చేసి చెప్పిందని అధికారులు తెలిపారు. దీంతో అతడు వెంటనే ఫ్లాట్‌కు చేరుకున్నాడని అన్నారు. లోపలి నుంచి గడియ వేసుకోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూసేసరికి ఆమె ఉరి వేలాడుతూ కనిపిచిందన్నారు. వెంటనే ఆమెను అంధేరిలోని సెవెల్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. ఇకపోతే, ఆదిత్య పండిట్, సృష్టి తులికి రెండేళ్ల కిందట ఢిల్లీలో కమర్షియల్ పైలట్ కోర్సు సమయంలో పరిచయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆదిత్య పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed