- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: చోటే భాయ్‌కి వ్యూహకర్తగా.. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా! బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament)లోని ప్రధాని కార్యాలయంలో బుధవారం తెలంగాణ (Telangana)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని వారికి సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నాటికి పార్టీని ప్రతి గడపగపడకి తీసుకెళ్లి రాష్ట్రంలో బీజేపీ (BJP) సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పని చేయాలని ప్రధాని మోడీ ఎమ్మెల్యే(MLA)లు, ఎంపీ (MP)లకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పీఎం (PM) ఆరా తీశారు.
ఈ క్రమంలోనే ప్రధానితో రాష్ట్ర బీజేపీ (BJP) నేతల భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (Modi) గారూ.. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలం నేతలంతా అంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతల (Congress Leaders)తో కలిసిపోయి మరీ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చోటే భాయ్‌కి వ్యూహకర్తగా.. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఏమాత్రం విశ్రమించకుండా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం.. ‘చేయి’ కలుపుతూ.. చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరని ధ్వజమెత్తారు. రేవంత్ (Revanth) మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ‘హైడ్రా’ (HYDRA) మంచిదంటారు, మూసీ (Musi) కావాలంటారు.. ఏమన్నా అంటే నిద్ర నటిస్తారని సెటైర్లు వేశారు. పిల్లలు చనిపోయినా.. రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారని ఆక్షేపించారు. తెలంగాణ (Telangana)లో వారి చేతిలోనే కమలం ఉంది.. జాగ్రత్తగా.. భద్రంగా అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
Modi గారూ..కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు!చోటేభాయ్ కు వ్యూహకర్తగా...కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా.. విశ్రమించకుండా పని చేస్తున్నారు!చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం'చేతి' కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని… pic.twitter.com/UQTLiUw9qP
— KTR (@KTRBRS) November 28, 2024