Samagra Kutumba Survey: కుటుంబ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి.. వివరాలు నమోదు చేసిన అధికారులు

by Rani Yarlagadda |
Samagra Kutumba Survey: కుటుంబ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి.. వివరాలు నమోదు చేసిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్, అధికారులు.. సీఎం రేవంత్ చెప్పిన కుటుంబ వివరాలను నమోదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం అధికారులతో మాట్లాడిన సీఎం.. సర్వే పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు.

హైదరాబాద్ (Hyderabad) పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వివరాలు నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సర్వేలో కచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Advertisement

Next Story