Tirumala: శ్రీవారి ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ అనుచరుడి హల్ చల్

by Rani Yarlagadda |
Tirumala: శ్రీవారి ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ అనుచరుడి హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో శ్రీవారి ఆలయం ముందు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరుడైన వంశీధర్ రెడ్డి (Vamsidhar Reddy) హల్ చల్ చేశాడు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ నిర్వహించాడు. ఆలయం ముందు అంత హడావిడి జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ (TTD Vigilence) అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చినట్లైంది. వంశీధర్ రెడ్డి ఇంత చేస్తున్నా.. అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వంశీధర్ రెడ్డి అనుచరులు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. తిరుమలలో ఆయన చేస్తున్న పనుల్ని వీడియో తీస్తుండగా సిబ్బంది మీడియాను అడ్డుకోబోయారు. వీడియోలు ఆపాలంటూ ఫైరయ్యారు.

తిరుమలలో గతంలోనూ వైసీపీ నేతలు ఇలాంటి పనులకు పాల్పడ్డారు. అప్పుడు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్, పోలీసులు కేసులు పెట్టారు. కానీ.. ఈ ఘటనలో మాత్రం ఇంతవరకూ టీటీడీ విజిలెన్స్ స్పందించలేదు.

Advertisement

Next Story