గురుకుల మీద పాలిటిక్స్ చేయద్దు..: మంత్రి పొన్నం

by Aamani |
గురుకుల మీద పాలిటిక్స్ చేయద్దు..: మంత్రి పొన్నం
X

దిశ,సిద్దిపేట ప్రతినిధి : గురుకుల మీద పాలిటిక్స్ చేయద్దు అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూం లా వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో పాఠశాల గ్రౌండ్ ,వంటగది, బాత్ రూమ్, వంటగది లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు ...బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50 శాతం రెంట్ లు పూర్తి చేశామని యజమానులు భవనంలో పెండింగ్ పనులు ఏం లేకుండా చూసుకోవాలని సూచించారు. వంటశాల కి వంట చేస్తున్న సిబ్బందితో మాట్లాడి అన్నం కూరలను పరిశీలించారు. ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. ఆహార నాణ్యత లో లోటు ఉంటే చర్యలు తప్పవని మంత్రి అధికారులను హెచ్చరించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలా ఉందని, ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో డీఎంహెచ్ వో , డీఆర్డీవో, డీపీఓ, స్థానిక పంచాయతీ సెక్రటరీ లతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రతి 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచినట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు అన్ని రకాల కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలి కాని విద్యార్థుల మీద రాజకీయం చేయద్దని సూచించారు. విద్యార్థి నాయకుడిగా అన్నిటి మీద అవగాహన ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనారిటీ గురుకుల ల్లో ఏ సమస్య దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed