Minister Aanam: తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన గత ప్రభుత్వం.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

by Shiva |
Minister Aanam: తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన గత ప్రభుత్వం.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం (YCP Government) పూర్తిగా దెబ్బతీసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Aanam Ramnarayana Reddy) అన్నారు. ఇవాళ ఆయన తిరుమల (Tirumala)లో మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ సాంప్రదాయాలను, ఆగమ శాస్రాలను గత ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల (Tirumala)లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి శ్రీవారి దర్శక భాగ్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. తిరుమల గతంలో వివాదలకు కేంద్ర బిందువుగా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందంటూ భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని తెలిపారు. భక్తులందరికీ ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అసౌకర్యం కలిగితే భక్తుల సూచనలు సలహాలను స్వీకరిస్తున్నామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed