- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nadendla Manohar:‘ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దు’.. రైతులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు
దిశ,వెబ్‌డెస్క్: రైతుల నుంచి ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి(State Civil Supplies Minister) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) బుధవారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ట్రాన్స్‌ఫోర్ట్, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతులు(farmers) తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు అని సూచించారు. కృష్ణాజిల్లా(Krishna District), పామర్రు నియోజకవర్గం, కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాల్లో యంత్రాలతో కోసి రోడ్లపై ఆరబోసిన వరి రాశులను మంత్రి నాదెండ్ల(Minister Nadendla) పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు(farmers) ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లు(Rice mill)కు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల రైతులకు కీలక సూచనలు చేశారు. తక్కువ రేటుకు అమ్ముకోవద్దు అని తెలిపారు. ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. తేమ శాతంలో కూడా సడలింపు చేశామని 24% శాతం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కేల ద్వారా అమ్ముకోవచ్చని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, పౌర సరఫరా అధికారి ఆర్డీవో మరియు తహసీల్దార్ పాల్గొన్నారు.