Damodara: వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని నిరూపించాం.. మంత్రి దామోదర

by Ramesh Goud |
Damodara: వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని నిరూపించాం.. మంత్రి దామోదర
X

దిశ, వెబ్ డెస్క్: వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని, వ్యవసాయమంటే దండగ కాదు.. పండుగ అని నిరూపించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Rajanarasimha) అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా(Mahaboobnagar District) అమిస్తాపూర్‌(Amisthapur)లో రైతు పండుగ సదస్సును మంత్రులు దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswar Rao), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. రైతుల పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని‌ చెప్పి, ప్రభుత్వం(Congress Govt) వచ్చిన నాటి నుంచే ఆ మాటను ఆచరణలోకి తీసుకొచ్చామని తెలిపారు.

11 నెలల కాలంలోనే 54,280 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేశామని, ఏకకాలంలో 22.5 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుపాయల రుణమాఫీ చేశామని అన్నారు. అలాగే పండిన ప్రతి గింజనూ కొనే బాధ్యత మా ప్రభుత్వానిదేనని, రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణకు 8 వేల కేంద్రాలను ప్రారంభించామని స్పష్టం చేశారు. అంతేగాక వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం రైతులను బెదిరించిందని, కానీ వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని మా ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. మా ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు, క్వింటాకు 500 రూపాయల బోనస్(500 Bonus) ఇస్తోందని, వరి మాత్రమే కాదు, మిగతా పంటలకు కూడా మద్ధతు ధర(MSP) ప్రకటించి, కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పుడు వ్యవసాయమంతా యంత్రాల మీదే నడుస్తోందని, సాగుకు సాంకేతికత(Technology)ను జోడించి రైతుల ఆదాయం పెంచేలా ప్రభత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story