- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెపక్ తక్రా వరల్డ్ కప్ – 2025

దిశ, తెలంగాణ బ్యూరో : సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025 పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ సెపక్ తక్రా ఫెడరేషన్ వైఎస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ ప్రేంరాజ్, సెపక్ తక్రా అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ వరల్ కప్ పోటీలు మార్చి 20 నుంచి ఆరు రోజుల పాటు బీహార్‌లోని పాట్నాలో ఉన్న పాటలీపుత్ర స్టేడియంలలో జరుగుతాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రేంరాజ్, పెరిక సురేష్ లు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి మహిళలు, పురుషుల జట్లు- పోటీ పడబోతున్నాయని అన్నారు. దేశంలో సెపక్ తక్రాకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.
సెపక్ తక్రా గేమ్స్ఒక మైలురాయి..
భారతదేశం అంతటా సెపక్రాను ప్రోత్సహించడంలో ఈ వరల్డ్గేమ్స్ఒక మైలురాయి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్ ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్ ఈవెంట్, క్వాడ్ ఈవెంట్ నాలుగు విభాగాలలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేకమైన క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం ఈ ఛాంపియన్షిప్ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
ఛాంపియన్ షిప్ నిర్వహణలో ఇంటర్నేషనల్ సెపక్ తక్రా ఫెడరేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సురేష్ ప్రశంసించారు. సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం దేశానికి గర్వకారణమనీ, ఇది మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సురేష్ అన్నారు. పాట్నాలోని పాటలిపుత్ర ఇండోర్ స్టేడియంలలో జరిగే ఈ వరల్డ్‌కప్, ఇంటర్నేషనల్ స్పెపక్ తక్రా ఫెడరేషన్ స్పెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలిపారు.
గేమ్స్‌కు బీహార్ సీఎం నితీష్, ఎంపీ ఈటల..
ఈ క్రీడ ప్రారంభోత్సవానికి బీహార్ సీఎం నితీష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారనీ రాష్ట్రం నుంచి మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరవుతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో స్పెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. ఆర్. ప్రేమ్ రాజ్, తెలంగాణ అధ్యక్షుడు సురేష్ కుమార్ తో పాటు, వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ్ స్వామి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బాబురాం సాగర్, 38 నేషనల్ గేమ్స్ డిప్యూటీ ఛీఫ్ కే మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025 పోటీలకు హాజరు కావాలని ఈటల రాజేందర్ ను ప్రేంరాజ్, సురేశ్ తదితరులు ఆహ్వానించారు.