అసెంబ్లీలో తాండూర్ త్రిలింగ రామేశ్వరాలయ ప్రస్తావన..

by Sumithra |
అసెంబ్లీలో తాండూర్ త్రిలింగ రామేశ్వరాలయ ప్రస్తావన..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయని అందులో ముఖ్యంగా తాండూరు గ్రామంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రమైన త్రిలింగ రామేశ్వరాలయం పర్యట కేంద్రంగా ఏర్పాటు చేస్తే చాలా అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీలో చర్చించారు.

రాష్ట్రస్థాయిలో త్రిలింగ రామేశ్వర ఆలయ ఖ్యాతిని చాటి చెప్పే ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్ర టూరిజం పాలసీలో మన దేవాలయం యొక్క పేరును చేర్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించడానికి ప్రయత్నం చేసినందుకు ఎమ్మెల్యే మదర్ మోహన్ రావుకు త్రిలింగ రామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మ దత్తు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story

Most Viewed