- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శనివారం నుంచి అంగన్వాడీ సెంటర్లు ఒక్కపూట మాత్రమే

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు శుభవార్త చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అంగన్వాడీ సెంటర్లను ఒక్క పూట మాత్రమే నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 12.30 వరకు మాత్రమే అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాలని ఉత్తర్వల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రమక్రమంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణపై ద్రుష్టి సారించింది.
అయితే పాఠశాలలకు కూడా 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంతో అంగన్వాడీ సెంటర్లకు కూడా ఈ నియమాన్ని వర్తింపజేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎండలు ఎక్కువగా నమోదవుతుండడంతో చిన్న పిల్లలు డీ హైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున అంగన్వాడీ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.