- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్... అక్రమ కట్టడాలు కూల్చివేత
దిశ, రామకృష్ణాపూర్ : దిశ కథనానికి సింగరేణి అధికారులు స్పందించారు. కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ ఏ జోన్ ఏరియాలో ఓ కార్మికేతరుడు సింగరేణి సంస్థ అనుమతులు లేకుండా కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. దాంతో ఈనెల 28న దిశ దినపత్రికలో ఆగని అక్రమ నిర్మాణాలు అని ప్రచురితమైన కథనానికి మందమర్రి సింగరేణి ఉన్నతాధికారులు స్పందించారు.
ఎస్టేట్ అధికారి వెంకట్ రెడ్డి, ఎస్అండ్ పీసీ ఏఎస్ఓ నగునూరి రవి ఆదేశాల మేరకు ఎస్అండ్ పీసీ సిబ్బంది గురువారం రామకృష్ణాపూర్ ఏ జోన్ ఏరియా సింగరేణి క్వార్టర్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సింగరేణి స్థలాల్లో అక్రమ కట్టడాలు జరిపితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ కట్టడాలను నిరోధించడానికి ఎస్అండ్ పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్ బట్టారి చంద్రమౌళి, జమ్మిదార్ గుండ రాజయ్య, ఎస్ అండ్ పీసీ ఎస్టేట్ సిబ్బంది శాంతకుమార్ పాల్గొన్నారు.