- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినూత్న నిరసన..సీఎం విగ్రహం ఏర్పాటు చేసుకొని మాజీ హోంగార్డు శాంతి దీక్ష
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఓ మాజీ హోంగార్థ్ తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఏర్పాటు చేసుకొని శాంతి దీక్ష చేపట్టాడు. ఇవాళ పట్టణంలోని రడగంబాల బస్తి మున్సిపల్ ఆఫీస్ సమీపంలో తన నివాసం లో సకినాల నారాయణ శాంతి దీక్ష చేపట్టారు. హోంగార్డు సమస్యలతో పాటు తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని సకినాల నారాయణ శాంతి దీక్ష కు పూనుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హోంగార్డు వ్యవస్థను పర్మినెంట్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అన్యాయంగా రిమూవల్ అయిన కోర్టు ద్వారా వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, రిటైర్మెంట్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద రూ. పది లక్షలు 60 సంవత్సరాల వయ పరిమితిని 65 కి పెంచాలని ప్రభుత్వం స్కీమును ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంగార్ సమస్యలు పరిష్కారమయేంతవరకు శాంతి దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సత్యనారాయణ చేపట్టిన శాంతి దీక్ష సమాచారంతో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై మహేందర్ ఘటనస్థలికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.