- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అఖిల్ - జైనబ్ పెళ్లిపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మ్యారేజ్ జరిగేది అప్పుడే అంటూ
దిశ, సినిమా: అక్కినేని అఖిల్ రీసెంట్‌గా జైనబ్ రవడ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున తన ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ .. అఖిల్- జైనబ్‌ల నిశ్చితార్థ ఫొటోలను షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి అఖిల్ పేరు సోషల్ మీడియాలో తెగ మారు మ్రోగిపోతోంది. కాగా గత కొంతకాలంగా వీళ్లు ఇద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అంటూ తెలుస్తుంది. మరి ముఖ్యంగా రానా-మిహికా బజాజ్ పెళ్లి మూమెంట్ నుండే వీళ్ల ప్రేమ స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగ చైతన్య శోభితల పెళ్లి రోజే అనగా డిసెంబర్ 4న ఈ జంట కూడా చేసుకోబోతున్నట్లు కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘అఖిల్- జైనబ్‌లు డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను నా చిన్న కొడుకు పెళ్లిని వచ్చే ఏడాది చేస్తాను. ప్రస్తుతం అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అతనికి కాబోయే భార్య జైనబ్ చాలా మంచి అమ్మాయి. వారిద్దరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. దీంతో డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్నట్లు వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.